అద్దం
నిలువుటద్దం ఎందుకు
నీకు
నిలువెత్తు మనిషిని
నేనున్నా చూడు
అద్దం లో నిన్ను
నువ్వు చూసుకుంటావెందుకు
అద్దం లాంటి నా
మనసులోకి తొంగి చూడు
మరుమల్లెల సింగారంతో
మురిసిపోతావెందుకు
నా శ్వాసలో నీ ఊపిరిని
రంగరించి చూడు
నన్ను నాలాగే
అనుకుంటున్నావెందుకు
నీ ఊహల తలపులతో నీలాగే
మారిపోయాచూడు
మనసు విప్పి మనసుతో
చూడవెందుకు
నాలో నిన్నే
చూసుకుంటావు చూడు
మనస్వినీ
No comments:
Post a Comment