శిథిలమనసు
వసంతం
రానేరాదని తెలుసు
మారాకుల కోసం
ఆరాటం ఎందుకు
శ్రావణం
కురిసిపోదని తెలుసు
చిరుజల్లులకోసం
ఎదురుచూపులు ఎందుకు
మార్గశిరం
శిరస్సు ఎత్తదని తెలుసు
మంచుపూల వానకై
నింగివైపు చూస్తావెందుకు
గమ్యమే
తెలియని పయనమని తెలుసు
నడిచిన బాటను
తుడిచివేస్తావెందుకు
నింగి తారకలు
చేతికి అందవని తెలుసు
ఎక్కిన
మెట్లను ధ్వంసం చేస్తావెందుకు
వెనక్కి
తిరిగి చూస్తే
అడుగు
వేసేందుకు
జానెడు జాగా
ఉండదు
శిథిలమైన మనసు
ముక్కలు తప్ప
No comments:
Post a Comment