స్వీకరిస్తున్నా
మెదడునిండా రణగొణధ్వనులు
మనసునిండా
చితిమంటల చిటపటలు
అంతరంగంలో
అంతులేని అలజడులు
జారిపడిన
కన్నీటిలో రాలిపడుతున్న స్వప్నాలు
ఆలోచనలను
కమ్మేసిన మాటల తూటాలు
మనసు
సంద్రాన్ని చిదిమేసిన ఆవేశపుకెరటాలు
కునుకులేని
కంటిలో రగులుతున్నాయి మంటలు
మండుతున్న
చితిలో కాలుతున్నాయి అనురాగాలు
నిద్రలేని
రాత్రులను కానుకగా ఇచ్చావు నాకు
దేవుడా
స్వీకరిస్తున్నా
నీ బహుమానాలు
No comments:
Post a Comment