అంతా అలాగే ఉంది
అలా ఏమీ
జరగలేదు
ఎలాంటి మార్పూ
రాలేదు
నవ వసంతాలు
కురిసిపోలేదు
కనక వర్షాలు
కనుచూపు మేరా కానరాలేదు
తెప్పలుగా
చెరువు నిండలేదు
కప్పలు
పదివేలు చేరనేలేదు
కొత్త
పలకరింపులు లేనేలేవు
చెంతకు
చేరినవారూ లేరు
ఉత్సాహం లేదు
ప్రోత్సాహం
లేదు
ఎక్కడవేసిన
గొంగళి అక్కడే ఉంది
జీవితమనే
అంగడి నడుస్తూనే ఉంది
నేనే ఉన్నాను
నాడు
నేనే ఉన్నాను
నేడూ
అన్నీ భ్రమలే అనితెలుసు
శిథిల శిఖర
పునర్నిర్మాతను నేనే అనీ తెలుసు
ReplyDeleteఅంగడి నడుస్తా ఉన్నది అన్నారు చూసారు అదే పదివేలు
చాలా మందికి దుకాణమే బందు !
జిలేబి