Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 2 September 2020

గూడు చెదిరిన పక్షులు


గూడు చెదిరిన పక్షులు
కలిసిరాని ఘడియలు
మరఫిరంగులై దాడులు చేస్తుంటే
అందంగా అల్లుకున్న నా భావ సౌధం కుప్పకూలిపోతోంది...
ఒక భావానికి మరో భావం
జతచేసి నిర్మించుకున్న
నా ఆశల గూడు పునాదులు
ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి...
దిక్కులేని నా భావాలు
ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి
గూడు చెదిరిన పక్షుల్లా...

No comments:

Post a Comment