భస్మీపటలం
వేయి అక్షౌహిణుల పదఘట్టనల
గర్జనలతో
భస్మీపటలమవుతున్న
మస్తిష్క మైదానం...
బీటలువారి కుప్పకూలుతున్న
మనోశిఖరం...
ఎక్కడో ఒక చీకటిఖడ్గం
వెన్నెలమ్మ తలనరుకుతున్న
హాహాకారం....
అదిగో నల్ల రంగు పులుముకున్న
ఆకాశాన్ని వీడి
నేల రాలుతూ ప్రాణం విడుస్తున్న
ఓ నక్షత్ర శిథిలం...
ఏమిటీ అయోమయం
మనసు ఫలకంపై ఎందుకీ
అల్లకల్లోలం...
No comments:
Post a Comment