పిచ్చోళ్ళు...
పుట్టుకతోనే మెదడు సక్రమంగా
లేక మానసిక వికలాంగులుగా మారినవారిని పిచ్చోళ్ళు అని ముద్ర వేస్తోంది ఈ లోకం.. ఎందుకో
నాకు ఈ లోకంలో అందరూ పిచ్చోళ్లని అనిపిస్తోంది.మెదడు పనిచేయని వ్యక్తి తనున్న స్థితిని
అత్యంత ఉన్నతమైనదని భావించి ఏదో తెలియని అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తాడు. పాపం పిచ్చోడు
కదా అని జాలి చూపిస్తాం.. కానీ లోకంలో అందరూ ఈ జాలికి అర్హులేనని అంటాను నేను.. ఎందుకంటే
ఇక్కడ అందరూ పిచ్చోళ్ళే... కొందరికి మతం పిచ్చి. ప్రపంచంలో ఉన్నతమైన మతం తనదే అని అనుకుంటూ
ఇతర మతస్థులను పురుగులా చూసే మనస్తత్వం పిచ్చిగాక మరేంటి? ఇక కులపిచ్చోళ్ల లెక్క అంతా
ఇంతా కాదు.. ఇంకో రకం పిచ్చోళ్ళున్నారు, వీళ్ళ పిచ్చితనం పేరు డబ్బు. డబ్బు పిచ్చి
ఉన్నవాళ్లు తమచుట్టూ గిరిగిసుకుని మిగతా మనుషులను పిచ్చోళ్ల కింద జమకడతారు, వాళ్ళు
మాత్రం డబ్బు పిచ్చిలో తూలుతూ రక్త సంబంధాలను గిరాటు వేస్తారు. కొందరికి కామ పిచ్చి.
మొగుడు బయటికి వెళ్ళగానే ప్రియుడితో కులికే పెళ్ళాం, బయటికి వెళ్లి పక్క చూపులు చూసే
మొగుడూ పిచ్చోళ్ళే.. నేను మాత్రమే నిజం, మిగతా అందరూ ద్రోహులేనంటూ నేను అనే సంద్రంలో
కొట్టుకుపోయేవాళ్ళు కూడా పిచ్చోళ్ళే.. బాగా చదివానని ఒకడు, అందంగా ఉన్నానని మరొకరు
ఇలా ఒకరేంటి అందరూ ఏదో ఒక పిచ్చిలో తన్మయత్వం పొందుతున్నారు. పుట్టుకతో పిచ్చి ఉన్నవారిని
పిచ్చోళ్ళు అంటూ తమ పిచ్చికి మాత్రం అందమైన పేర్లు తగిలించుకుని సంబరపడుతున్నారు. వీళ్లందరినీ
ఆరోగ్యవంతులైన మనుషులుగా భావించే నాది మాత్రం పిచ్చికాదా? నేనూ ఏదో ఒక పిచ్చిలో బతుకుతూనే
ఉంటా. ఇప్పుడు చూడండి పిచ్చి పిచ్చిగా ఏదో రాసేసాను, ఇది ఏ పిచ్చోళ్ళో చదివి లైక్ చేస్తారని
ఆశించటం నా పిచ్చికాక మరేంటి?
deentlo pichi emundi, meeru cheppindi correcte :)
ReplyDeletemeeru cheppindi nijame, raasina meeku pichi kaadu, like chese vallaku kaadu..
ReplyDeletemeeru cheppindi nijame, raasina meeku pichi kaadu, like chese vallaku kaadu..
ReplyDelete