నీవెక్కడా
నమ్మకమా నీవెక్కడా
ఉన్నావా నీవు ఇలలోనా
ప్రతి ఘడియలో
ప్రతి చర్యలో
నిన్నే వెతికాను
నమ్మకమా నీవున్నావా
ఒక పదంలా మిగిలిపోయావా
అన్నింటా నిన్నే
శోధించా
నాలోనూ నిన్నే వెతికా
నాలో ఎక్కడా నీవు
కానరాలేదు
నా మాటలో నీ ఉనికి
లేదు
నా చేతలో నీ ఆనవాళ్ళు
లేవు
నాలో నీవున్నావేమోనని
భ్రమలే పెంచుకున్నా
ఎక్కడ కరిగిపోయావు
ఎక్కడకు ఎగిరిపోయావు
అనుమానపు చీకటిలో
కలిసిపోయావా
ఆవేశపు అగ్నిలో
కరిగిపోయావా
ద్వేషమనే సునామీలో
కొట్టుకుపోయావా
నువ్వు నాలోనే లేకపోతే
ఎవరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా
నాకేమి
నాలో ఎక్కడా కానరాని
నమ్మకాన్ని
ఇక శోధించను
మనస్వినీ
No comments:
Post a Comment