ప్రాణం పోసుకున్న బొమ్మ
నాలుగు వసంతాల కింద
మనోఫలకంపై
చెరగని ముద్ర వేసిన
ఆ చిత్రం
అందమైన ఆ దృశ్యం
ప్రాణం పోసుకుందా
ఆ జవ్వనాల బొమ్మలో
కదలికలు వచ్చాయా
ఒక బొమ్మగానే మిగిలిన
ఆ ఛాయాచిత్రం
నా ముంగిట
నడయాడుతోందా
అవును
అచ్చం అలాగే అనిపిస్తోంది
నాటి ప్రతిభావం
మరలా మొగ్గ తొడుగుతోంది
నాటి సోయగం
నాటి లావణ్యం
నాటి పరువం
నాటి విలాసం
అలనాటి రాజసం
నేడు మరలా
కనులముందు తొణికిసలాడుతోంది
సంక్షిప్తసందేశమై
నా చరవాణిని చేరిన
ఆ దృశ్యం
నేడు
నాటి వస్త్ర ధారణతో
నీరూపంలో
నా ముందు నిలిచింది
మనస్వినీ
No comments:
Post a Comment