నేను నీకై
కనురెప్పల పరదాలను
తివాచీలుగా
పరుచుకున్నా
గుండె కవాటాలను తీసి
నీ పాదాలకు పుష్పాలుగా
అర్పించుకున్నా
నా శ్వాసలో ఊపిరిని
నీకే అంకితం
ఇచ్చుకున్నా
నాలో చెలరేగే భావాల
అక్షర మాలికలను
నీ కంఠ హారాలుగా
చూసుకున్నా
నా ప్రతి ఆలోచనను
నా ప్రతి అడుగును
నీకోసమే మలుచుకున్నా
నేను నేనుగా
నన్ను నీకే
ఇచ్చుకున్నా
నాలో భావాలు
నా అంతరంగాలు
నా ఆశలు
ఆకాంక్షలు
అన్నీ నాలో నాలాగే
ఉన్నాయి
నన్ను నన్నుగా
చూసుకుంటావనే ఆశతో
అంతంలేని అనురాగంతో
నన్ను నేను
నీకు కానుకగా
ఇచ్చుకున్నా
నా కానుకను
గుండెకు
హత్తుకున్నావనే
నమ్మకంతోనే
ఇంకా జీవిస్తున్నా
మనస్వినీ
No comments:
Post a Comment