ఖైదీ మనస్సు
ఏమో
నిజమేనేమో
నువ్వే నిజమేనేమో
నువ్వు అనుకున్నది
ఇదేనేమో
ఎవరిని
ఎందుకు నిందించాలి
ఎవరిని ఎందుకు
బాధ్యుల్ని చేయాలి
ఎవరిని ఎందుకు
బాధించాలి
జననం నీవే
మరణం నీవే
గమనమూ నీవే
అన్నీ నీవే చేసినప్పుడు
నిమిత్తమాత్రులెందుకు
బాధ్యత వహించాలి
అందుకే నీకు
ప్రణమిల్లుతున్నా
నీ ప్రతిరాతకు
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
విధిరాతను
మార్చే శక్తి లేని మనస్సు
ఆ గీతల వలయంలో
ఖైదీగా మిగిలిపోయింది
మనస్వినీ
No comments:
Post a Comment