నా మనసు నాకే తెలియదా
నా మనసులో
ఏముంది
నా మనసేం
కోరుతోంది
నా మనసుకు ఏం
కావాలి
నా మనసు
దేన్ని ఇష్టపడుతోంది
నా మనసుకు
మోదం ఎప్పుడు
నా మనసుకు
ఖేదం ఎప్పుడు
నా మనసులో
ప్రేమ ఎప్పుడు పుడుతుంది
నా మనసులో
ద్వేషం ఎప్పుడు జనియిస్తుంది
నా మనసు
కరిగేది ఎప్పుడు
నా మనసు బండబారేది
ఎప్పుడు
నా మనసు
నవ్వేది ఎప్పుడు
నా మనసు
ఏడిచేది ఎప్పుడు
నా మనసులో ఏం
జరుగుతోంది
నా మనసు నాకే
తెలియదా
నా మనసు సొదలు
నాకు తెలియవా
నా మనసు
రోదనలు నాకు వినిపించవా
నా మనసు
అంతరంగం
నా మనసు
స్పందన
నా మనసు వేదన
నా మనసుకు కాక
ఇంకెవరికి తెలుసు
మనస్వినీ
No comments:
Post a Comment