నిన్ను చూస్తే
నిన్ను చూస్తే
లిపిలేని భావాలు
అక్షరాలుగా మొలకలు వేస్తాయి
గులాబీ రేకుల పెదాలు విచ్చుకుంటే
విరిసిన భావాలు నాట్యం చేస్తాయి
గళము నుంచి జాలువారిన
భాష్యములు
నా కవితలుగా మారి
ముత్యాల్లా రాలుతుంటాయి
చల్లదనాల చూపుల వెన్నెలలో
నా కలల నక్షత్రాలు పొడిగా మారి
మెరుపుల వాన కురిపిస్తాయి
మయూరమువోలె నీ నడకలు
మనో సీమలో
ప్రకంపనలే రేపుతాయి
నువ్వంటే
నీకేం తెలుసు
నీ సర్వమూ
నా శ్వాసనిశ్వాసలే
మనస్వినీ
No comments:
Post a Comment