ఆగిన అన్వేషణ
జీవనగమనంలో
అడుగు తీసి
అడుగువేస్తూనే ఉన్నా
ప్రతి అడుగునూ
ప్రగతిబాటగా
మలుచుకున్నా
అందరూ ఉన్నా
ఎవరూ లేని అనాధగా
ఏదో తెలియని వెలితితో
ఎవరికోసమో ఎదురుచూస్తూ
నడుస్తూనే ఉన్నా
ఒక్కసారిగా అడుగులు
ఆగిపోయాయి
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
కనులముంగిట వాలింది
నా నిరంతర అన్వేషణ
నా అంతరంగ శోధన
నా ముంగిట నిలిచింది
భావం మొలకలు వేసిన ఆది
ఘడియ నుంచి
అప్పటిదాకా
నేను కన్న కలలు
నేను అల్లుకున్న ఆశల
పందిళ్ళు
అన్నీ నిజమైపోయాయి
ఎక్కడా లేని ఊహా
సుందరి
కలల వేదికలో
కల్పనల ముంగిలిలో
మనోఫలకం లో
చెరగని ముద్ర వేసిన
మనస్విని
ఊహల తెరలను తెంచి
వాస్తవమై నిలిచింది
అవును
నా కల ఫలించింది
అక్షరమాలికలుగా అల్లుకున్న
నా భావాలన్నీ
ఒక ముద్దలా మారి
సుందరమైన ఆకృతికి
ప్రాణం పోశాయా
అనిపించింది
నిజమే
తను నా ఊహా సుందరే
కలల లోకం వీడి
నాలోకంలోకి అడుగిడిన
నా హృదయ నాయికే
నాటి నుంచి నేటి దాకా
నాలో అదే ఆరాధన
అదే భావన
తనను తనలాగే ఊహించుకున్నా
తనలాగే ప్రేమిస్తున్నా
నన్ను నన్నుగా
ప్రేమించినా
నాలో లోపాలే ఎత్తి
చూపినా
అదే ప్రేమ
అదే ఆరాధన
అదే భావం
నాలో సజీవంగా ఉంటుంది
ఎందుకంటే ఇప్పుడు
నా అడుగులు ఆగిపోయాయి
ఇక్కడే
ఇలాగే ఉంటాను
అంతం నన్ను ముద్దడినా
నా అడుగులు
ఇంకా ముందుకు సాగవు
ఇప్పుడు
నా అన్వేషణ ఆగిపోయింది
మనస్వినీ
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షల తో
అంతం మిమ్మల్ని ముద్దాడినా
ఆపకండి అడుగులని !
ఇంకా ముందుకు సాగ నివ్వండి !
అంతానికి అంతం లేదు !
శుభాకాంక్షల తో
జిలేబి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ReplyDelete