మనసంటే...
ఎవరికి తెలుసు మనసంటే...
ఎవరు చూసారు మనసు
నిండా
మనసుని...
ఎవరు చదివారు సమగ్రంగా
మనసుని...
ఎవరు తడిమారు మనసులోని
భావాలని...
ప్రియమైన మనిషి
అప్రియంగా పలికితే
కనులనుండి వెచ్చగా
జారిపడే కన్నీటి
చుక్కే
మనసు...
అశ్రువులు ఇంకిపోయి
రుధిర భాష్పాలు
కురిస్తే
అదీ మనసే...
మాటలు మరిచి
చేష్టలు ఉడిగి
మౌనంగా మిగిలిపోయే
కనుల భాష మనసే...
కన్నులలో మెరిసే
వెలుగులూ
పెదాలపై జిలుగులూ
మనసే...
హృదయవిదారక ఆక్రందనలూ
విరిసే నవ్వుల
పువ్వులూ
గిల్లి కజ్జాలు
కొంటె కవ్వింతలూ
మనసే...
మనసైన మనసు స్పందనలకు
ప్రతిస్పందనలూ
మనసే...
జీవన గమనంలో భావాల
సమాహారం
మనసే...
మనసును మనసుగా చదివే
గుణం
ఒక దైవిక వరమే
మనస్వినీ...
No comments:
Post a Comment