అక్షరాలే లేని భావం
జనియించిందా ఆ అక్షరం
అంకురించిందా ఆ భావం
ఉరకలు వేసిందా ఆ రాగం
ఎక్కడుంది ఆ అక్షరం
ఎక్కడ పుట్టింది ఆ
భావం
ఎక్కడ వినిపించింది ఆ
రాగం
లేదు ఆ అక్షరం ఇంకా
పుట్టలేదు
ఆ భావం ఇంకా
చిగురించలేదు
ఆ రాగం ఇంకా ఎవరూ
పాడలేదు
ఎవరు రాయగలరు నీలోని
భావాన్ని
ఎవరు తడిమి చూడగలరు
నీలోని అంతరంగాన్ని
పెదాలపై చిరునవ్వు
తొణికిసలాడుతున్నా
కళ్ళలో మెరుపులు కాంతులీనుతున్నా
అందరిలో ఒకరిలా
గలగలా నవ్వుతున్నా
ఉరకలేసే గోదారివే
అనిపిస్తున్నా
ఎవరు చూసారు నీలోని
వేదనని
ఎవరి మనసు చూసింది నీ
రోదనని
నీ ఆక్రందనకు అక్షరం
ఉందా
నీ ఆవేదనకు భావం ఉందా
నీ మానసిక కల్లోలానికి
అక్షర సంకెలలు వేసే
కవిత్వం పుట్టిందా
అమ్మవు నీవు
మనసు లోతున ఆక్రందనవు నీవు
నీతోటలో వికసించిన పుష్పం కోసం
మూగగా రోధించే ఆక్రందనవు
నీవు
ఆలిగా
జవరాలిగా
సహచరిగా
మార్గదర్శిగా నడిచే
నీలో నేను
నిత్యం చూసేది అమ్మనే
అమ్మగా నువ్వు అజరామరం
నీలో అమ్మతనానికి
నా భావంలో
అక్షరాలు లేనే లేవు
మనస్వినీ
No comments:
Post a Comment