Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 6 December 2015

నాకు అన్నీ తెలుసు

నాకు అన్నీ తెలుసు
విరిసే పెదాల మెరుపుల మాటున
చీకటిని ఓడిసిపట్టుకున్న వేదన తెలుసు
వెలుగులు జిలుగుల కంటి పరదాల వెనుక
ముత్యాల్లా మెరిసే కన్నీటి చాయలూ తెలుసు
ఆనందాల హేల
సరదాల నావ
మనసు సుడిలో చెలరేగే
అల్లకల్లోలాలూ తెలుసు
నెలవంక చల్లదనం పంచుకున్న
పాలవెన్నెలకు చీకటితోనే ఉనికి
ప్రచండ భానుడి వెలుగులు
చీకటి ఉంటేనే కదా మెరిసేది
మనసుకు తెలుసు వేదన
కన్నులకు తెలుసు
కన్నీటి విలువ
మనసైన మనసుకు
మనసులోని అంతరం తెలుసు
నా మనసుకు తెలుసు
నీలో దాగిన వేదన
నీ ఆలోచన
నీ అంతరంగం
నీ భావం
నీ ముభావం
నాకు ఎవరో చెప్పాల్సిన పని లేదు
నువ్వు కూడా నాకు చెప్పకు
నాకు అన్నీ తెలుసు
మనస్వినీ

2 comments:

  1. Good Post
    http://kscwritesinfo.blogspot.in/

    ReplyDelete
  2. పాలవెన్నెలకు చీకటితోనే ఉనికి
    ప్రచండ భానుడి వెలుగులు
    చీకటి ఉంటేనే కదా మెరిసేది
    మనసుకు తెలుసు వేదన..ఎంత బాగుందో

    ReplyDelete