నువ్వంటే నాకిష్టం లేదు
నీ తీయని పలుకుల
మధురిమ
నాకిష్టం లేదు
నీ కన్నుల వెన్నెల
నా కిష్టం లేదు
నీ కురుల సోయగాలు
నాకిష్టం లేదు
నీ మేని వంపుల పరువాలు
నాకిష్టం లేదు
నీదన్నది ఏదీ
నాకిష్టం లేదు
నీ ఆలోచన
నీ అంతరంగం
నీ భావం
నీ లాస్యం
నీ హాస్యం
ఏదీ నాకిష్టం లేదు
అవును
నువ్వంటే నాకిష్టం
లేదు
నీలో దేనినీ
నేనిష్టపడటం లేదు
నీలో సర్వమూ
నాకు ఇష్టం కాదు
అదంతా నా ప్రేమ
ఇష్టాన్ని జయించిన
భావం నాది
నీ సర్వములో నా
ప్రేమను నింపుకున్నా
ఇష్టమనే పునాదిలో
ప్రేమను బంధీ చేయలేను
ఇప్పుడు ఇష్టపడిన
దానిని
రేపు నేను ఇష్టపడను
అందుకే
నేను నిన్ను ఇష్టపడను
ఇష్టం ఎప్పుడైనా
మారవచ్చు
నీపై నాకున్న ప్రేమ
నా కడదాకా గుండెల్లో
దాగి ఉంటుంది
మనస్వినీ
No comments:
Post a Comment