నేనే దేవుడిని
నా ఆలోచనే శాసనం
నా పలుకే ఆదేశం
నా అడుగే నిర్దేశనం
నా చూపే ప్రభంజనం
అవును అంతా నాదే
సర్వమూ నేనే
నేను అనుకున్నదే అక్కడ
జరుగుతుంది
ఎవరి ఆలోచనకు అక్కడ
చోటు లేదు
కుట్రలు కుతంత్రాలు
దరి చేరవు
మాయలు మంత్రాలు కానరావు
మనీ మనసుల మతలబులు
దేవుడి చదరంగపు
ఎత్తులు
పగటి వేషాల జిత్తులూ
చిత్తయిపోయే మనసులూ
అక్కడ ఉండనే ఉండవు
అవును అక్కడ నాదే
రాజ్యం
నేను అనుకున్నదే వేదం
నా ఆలోచనలే ఆవిష్కారం
క్రియను నేనే
కర్తను నేనే
రాజును నేనే
రారాజునూ నేనే
హీరోను నేనే
జీరోనూ నేనే
మంచి నేనే
చెడునూ నేనే
మనసుకు నచ్చినా
మనసు నొచ్చినా
కారణమూ నేనే
అక్కడ దేవుడినీ నేనే
అది నా
కలల ప్రపంచం
మనస్వినీ
Monarch !
ReplyDelete
ReplyDeleteసూపర్ ! ఇట్లాంటి లోకం కోసమే నీహారిక గారు 'తడప్' రహే హై :)
జిలేబి