ముబారక్ మనసా
వేకువజామున
నీలినింగి కాన్వాసుపై
సలాము చేసే
వేగు చుక్క
కనులముందు నిలిచిందా
నేలరాలిన తారకమ్మ
పుష్పమై వికసించిందా
కనురెప్పలపై
మెరుపులా అద్దుకున్న
స్వప్నం
సాకారమై ముంగిట
వాలిందా
మనసులో ముద్రమైన
దృశ్యం
నిజమై నేల నిలిచిందా
సమస్తం పాదాక్రాంతమై
ప్రణమిల్లుతున్నదా
అవును స్వప్నం సాకారమయ్యింది
కల నిజమయ్యింది
ముళ్ళ బాటను జయించి
పూదోటను అక్కున
చేర్చుకుంది
ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈవేళ తొలి కిరణం
అందించింది
కుట్రలు కుతంత్రాల
లోకంలో
కరవాలమై నిలిచి
విజయ శిఖరాలను
అధిరోహించిన మనసుకు
మనసునిండా
నా మనసు చెబుతోంది
ముబారక్
మనస్వినీ
No comments:
Post a Comment