మృగాళ్ళ లోకంలో మగాడూ ఉన్నాడు
మనసు మగువకే సొంతం
కాదు
కన్నీరు అతివకే ఆస్తి
కాదు
మృగాళ్ళున్న ఈ లోకంలో
మగాళ్ళూ ఉన్నారు...
గుండెలు బాదుకుని
ఏడవకున్నా
గుండెలు పగిలినట్లు
మూగగా రోధించే
పురుషులూ ఉన్నారు...
మగువ మనసు విలువ
తెలియని దొరల లోకంలో
మనసు దెబ్బకు
కుప్పకూలిన
అభాగ్యులూ ఉన్నారు...
ఎవరికి తెలుసు మగవాడి
మనసు
ప్రతి మగాడూ కాదు
పశువు
మనసున్న మగాడు ఎప్పుడూ
బలి పశువు...
తప్పటడుగుల కాలం దాటి
బాధ్యతల లోకంలో
అడుగుపెట్టి
కుటుంబమనే శిరోభారం
నెత్తిన పెట్టి
ఎన్ని అడుగులు
వేస్తేనేం
చివరికి మిగిలేవి
నిందలే అయితే
ఆ మగాడికి దిక్కెవరు
ఆ కన్నీళ్లు తుడిచేది
ఎవరు...
జగమంత కుటుంబమని అనుకున్నా
మనసు గోడు వినే
వారుండరు
జారుతున్న కనులనీరును
మగాడిననే అహం
తాగుతుంటే
మనసు నిండా ఏడవలేక
మనసులోనే కుమిలిపోయే
మగ అబలలు
ఎంత మందికి తెలుసు...
నీకేంటి మగాడివి అని
అంటుంటే
మగాడిగా పుట్టి
బావుకున్నదేమో అంతుచిక్కక
కారు చీకట్లో అడుగులు
వేయలేక
అడుగు జాడలు మరువలేక
తప్పటడుగులు కూడా
వేయటం చేత కాక
నిర్జీవ మూర్తులై
మిగిలిపోయిన
మగాళ్ళ వ్యదార్థ గాథ
ఎంత మందికి తెలుసు...
కాని గాని వాడిగా
మిగిలి
ఆలి మాటలకు
విలవిలలాడుతూ
ఆశగా చూసే కన్నబిడ్డల ఆర్తికి
తల్లడిల్లుతూ
గమ్యమే లేని ప్రస్థానం
వైపు అడుగులు వేసే
మగాడి పయనం ఎందరికి
తెలుసు...
అతివలకు ఉన్న మనసే
మగాడికీ ఉంటుంది
మగాడి కంటిలోనూ
కన్నీరే వస్తుంది
మగాడి మనసూ ఓదార్పు
కోరుతుంది
ఆ మగాడి మనసు తెలిసేది
ఎందరికి...
మృగాళ్ళు ఉన్న ఈ
లోకంలో
మనసున్న మగాళ్ళూ
ఉన్నారు
మృగాడిని గుర్తించే
లోకం
మగాడిని
తెలుసుకోకపోవడం
మగాడికి ఒక శాపం
No comments:
Post a Comment