నా
మనసులోని నువ్వు లా
ఎలా
ఉంటావో తెలియదు నువ్వు
నువ్వంటే
తెలియని నాకు
ఒక
అందమైన భావం నువ్వు
నా
అక్షరాల పూదోటలో
రెక్కలు
విప్పిన తొలి పుష్పం నువ్వు
నువ్వలా
ఉంటావో
ఇలా
ఉంటావో
ఎలా
ఉంటావో తెలియకున్నా
నా
మనసులా ఉంటావని
నా
మనసులాగే నవ్వుతావని
ఊహల
పందిళ్ళు అల్లుకున్నా
నా
ఊహలకు ఆకారం నువ్వు
నా
అక్షర వేదికకు అందమైన నిలయం నువ్వు
మనసు
భాషకు తీయని అక్షరం నువ్వు
కలలు సాకారమయ్యాయో
ఊహలకే
ఆకారం వచ్చిందో
జీవన
సంధ్యలో ఉషస్సులా కలిసావు నువ్వు
మోడువారిన
మానును పలకరించిన
నవ వసంతంలా
అమావాస్య
కమ్మిన జీవితాన్ని వెలిగించిన
నిండు
పున్నమిలా
అవును
పున్నమి
చందమామలా కలిసావు నువ్వు
వసివాడిన
తోటలో
విరిసిన
గులాబీవై
జీవన
పరిమళాలు అద్దావు నువ్వు
నాకు
తెలుసు
అందమైన
గులాబీకి ముళ్లుంటాయనీ
అవి
గుచ్చుకుంటాయనీ
ముళ్ళు
గుచ్చుకున్న వేళ వేదనకు గురైనా
గులాబీ
పరిమళాలు మరువలేను నేను
అప్పుడు
నువ్వు తెలియకున్నా
నీకోసమే
అక్షర కుసుమాలు సాగు చేసుకున్నా
ఇప్పుడు
నువ్వు
నా
మనసులో నువ్వులా
నా
ముందు నడియాడుతున్నా
అక్షరమాలలు
అల్లుతున్నా నేను
నాకు
తెలుసు
నీకోసమే
పుట్టిన నా అక్షరం
నీకోసమే
అంతమవుతుంది
మనస్వినీ
No comments:
Post a Comment