ఒంటరి
అల్లంత దూరంలో కనిపిస్తోంది
రారమ్మని
పిలుస్తోంది
బాహువులు
చాచి ఆహ్వానిస్తోంది
మనసుకు
నచ్చిన నెచ్చెలిలా
మనసైన
ప్రియురాలిలా
అందమైన
కలకు అంతంలా
కరిగిన
స్వప్నాలకు వేదికలా
అందమైన
నేస్తంలా
అద్భుతమైన
దృశ్యంలా
ఇంకా
ఎందుకు ఆలస్యమని నిలదీస్తోంది
తన
కౌగిట కరిగిపొమ్మని అడుగుతోంది
నరకాన్ని
వీడి స్వర్గం చేరమని పోరుతోంది
పూలబాటలు
పరిచి నడిచి రమ్మని అడుగుతోంది
నిండైన
ఆహ్వానం దిశగా
వడివడి
అడుగులతో నడుస్తున్నా
గమ్యాన్ని
ముద్దాడాలని ఆరాటపడుతున్నా
ఒక్కసారి
వెనక్కి తిరిగి చూస్తే
నా
అడుగులజాడలు కానరాలేదు
కనుచూపు
మేరలో ఏ ఒక్కరూ కనిపించలేదు
నాతో
నడిచినవారెవ్వరూ తోడు రాలేదు
అవును
నేను ఒంటరిని
ఒంటరి
బాటసారిని
ఒంటరిగా
వచ్చాను
ఒంటరిగానే
వెళుతున్నాను
సేదతీర్చే
గమ్యాన్ని ముద్దాడాలని
మనస్వినీ
No comments:
Post a Comment