Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 1 November 2016

ఆ రోజు వస్తుంది

ఆ రోజు వస్తుంది
 
ఎక్కడుంది ఆ ప్రేమ
ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునే ప్రేమ
ఒకరికోసం ఒకరు మరణించే ప్రేమ
సర్వం మరిపించే పిచ్చిప్రేమ
నిజమే
ఆ ప్రేమ  కనిపించకపోవచ్చు
ఆ అనురాగం వికసించకపోవచ్చు
కరకు మాటల అంతర్జాలంలో
మృదువైన మనసు పలకరించకపోవచ్చు
ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది
ఒక మనసు మదిని తట్టి లేపుతుంది
అంతరంగంలో గూడుకట్టిన కొలనును పలకరిస్తుంది
ఒక మనసు పాదాక్రాంతమవుతుంది
పగిలిన ఒక హృదయం కనులముందు కుప్పకూలుతుంది
మాట నిలుపుకున్నా చూడు అంటూ
విరిగిన మనసు ముక్కలతో పాదాలను అభిషేకిస్తుంది
మరణంలోనూ సజీవపుష్పమై
కనులముందు వికసిస్తుంది
కనులనుంచి జారిన రెండు చుక్కలు
రాలిన కుసుమానికి మరలా ప్రాణం పోస్తాయి
దేహం అంతరించినా ప్రేమ సుగంధం
నలుదిశలా కమ్ముకుంటుంది
మనసప్పుడు ఒప్పుకుని తీరుతుంది
ప్రేమంటే ఇదేనేమోనని
మనస్వినీ

No comments:

Post a Comment