నేను
రాబందుల
రెక్క్కల నుంచి
జారిపడిన
సవ్వడిని నేను
నిశిరక్కసి
జడలనుంచి
రాలిపడిన
తారకను నేను
ఆకాశానికి
నిచ్చెన వేసి
పాము
మింగిన పావును నేను
చదరంగపు
క్రీడలో
బంధీగా
మిగిలిన రాజును నేను
స్వీయ
విధ్వంస రణస్థలిలో
ఆయుధము
లేని యోధుడిని నేను
కలిమి
లేమిల పోరులో
సైన్యమే
లేని సేనానిని నేను
నలుదిశలా
నలుగురు ఉన్నా
ఎవరూ
కానరాని ఒంటరి బాటసారిని నేను
విచ్చుకత్తుల
కరాళ నృత్యంలో
తెగిపడిన
పువ్వును నేను
నేనుగా
పుట్టిన నేను
నేనుగానే
మరణిస్తా
మనస్విని
No comments:
Post a Comment