నాకు
తెలుసు
ఆకాశంలో
చందమామను తెచ్చి
నీ
నుదుట పెట్టలేను
తారకలను
ఎరుకువచ్చి
నీ
సిగలో పువ్వుల్లా పెట్టలేను
నాకు
తెలుసు అది సాధ్యం కాదని...
నీ
బాటలో ఎర్రతివాచీలు పరిచి
గులాబీలతో
నీ పాదాలను పూజించలేను
స్వర్ణ
శోభిత అలంకారాలు నీకు చేయలేను
హంసతూలికా
తల్పముపై నిన్ను సేద తీర్చలేను
నాకు
బాగా తెలుసు
నాకంతలేదని...
చిరుముద్దుతో
నీ నుదుటిని అలంకరించి
దోసిటపట్టిన
నీ నవ్వులనే పువ్వులుగా మలిచి
నీ
చెంపలకు కెంపులు దిద్దగలను
కంటి
చూపులనే తారకలుగా
నీ
మేనికి సింగారాలు అందించగలను
నాకు
బాగా తెలుసు
నువ్వు
కోరుకునేదీ ఇదేనని...
ఒక
భావకుడిగా అక్షరాలు పోగేసుకున్నా
సిరిసంపదలు
పొందలేదు
అక్షర
విన్యాసాలు చేసానేగానీ
జీవన
చదరంగం ఆడలేను
నాకు
ఇంకా బాగా తెలుసు
అక్షరాలు
బతుకుబండిని లాగలేవని...
అక్షరాలను
ఆపలేను
కవితలను
కట్టడి చేయలేను
మనసు
రొదను బంధీ చేయలేను
నువ్వనుకుంటావేమో
అక్షరాలలోనే
నా ప్రేమ కనిపిస్తుందని
నేను
బలంగా చెప్పగలను
మరణించి
ప్రేమను నిరూపించగలనని
మనస్వినీ...
No comments:
Post a Comment