నీకిది న్యాయమా
పరుగులాంటి నడకే
కావాలని అన్నావు
ఉగ్గుపాల ధైర్యమే
కోరావు
ముక్కుసూటి తనమే ఊపిరి
అన్నావు
నిజాయితే అడుగుజాడలని
అన్నావు
తడబడే అడుగులపై భారం
మోపావు
బాధ్యతల బాటలో
మార్గాలు చెరిపేసావు
ముళ్ళ బాటలు వేసి
ముందుకు నడవమన్నావు
నేనింకా అడుగు తీసి
అడుగే వెయ్యలేదు
నువ్వు పరుగులు
తీస్తున్నావు
జీవితమా
నీకిది న్యాయమా
No comments:
Post a Comment