Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 6 July 2015

భావసమాధి

భావసమాధి

ఆగిపోతాయ్ నా రాతలు
విరిగిపోతాయ్ నా అక్షరాలు
సమాధి అవుతాయ్ నా భావాలు
అంతం లేనిది లేనే లేదు సృష్టిలో
నాశనం కానిది పుట్టలేదు జగతిలో
ఆది ఉన్న చోటే అంతమున్నది
కాల చక్రం నడిపే దినకరుడూ ఆరిపోతాడు
చల్లని వెన్నెల జాబిలీ నల్లబడతాడు
సముద్రాలు పొంగుతాయ్
పుడమి మునుగుతుంది
సృష్టి ఉన్నప్పుడు
అంతమూ ఉంటుంది
నాలోని భావాలకూ అంతమున్నది
నా అక్షరాలకూ పరిమితి ఉన్నది
నా రాతలకూ ముగింపు ఉన్నది
నా మనసు స్పందనలు నడిచేవరకూ
నా ఊపిరి శ్వాసలు నింపుకునేవరకూ
నా మస్తిష్కం రొదలు పెట్టే వరకూ
నా భావాలు పురివిప్పుతాయ్
నా అక్షరాలు రెక్కలు విచ్చుకుంటాయ్
ఎవరికీ నచ్చని నా అక్షరాలు
నాతోనే మరణిస్తాయ్
ఆగిపోయే నా శ్వాసలోనే
నా అక్షరాపుష్పాలు
సమాధి అవుతాయ్

No comments:

Post a Comment