Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 3 July 2015

జీవితమా నీకు సలామ్

జీవితమా నీకు సలామ్

ఎంత దగ్గరగా చూస్తున్నా నిన్ను
నీలో నేనుగా మారిపోయి
చాలా దగ్గరగా గమనిస్తున్నా నిన్ను
నీలో ఎన్ని వింతలు
ఎన్నెన్ని చిత్రాలు
మరెన్నో మలుపులు
ఒక మలుపు అనుభవమైతే
మరో మలుపు చిత్రమే నాకు
ఎప్పుడు ఎటు మరలుతావో
ఏ అనుభూతిని అందిస్తావో
తెలియనే తెలియదు
ఒకసారి మనసారా నవ్విస్తావు
ఇంకోసారి గుండెనిండా ఏడ్పిస్తావు
నవ్వుల పువ్వులూ నీలో విరబూస్తాయి
కన్నీటి ధారలూ నీలోనే కరిగిపోతాయి
నిన్ను గమనిస్తూనే
నీతోనే నడుస్తున్నా
నీ ప్రతి అనుభూతినీ ఆస్వాదిస్తున్నా
నీ నవ్వులో మెరుస్తున్నా
కన్నీటిలో కొట్టుకుపోతున్నా
అయినా నీతోనే నడుస్తున్నా
ఎందుకో తెలుసా
నీ ప్రతి మలుపు నాకు మైలురాయే
నీ ప్రతి అడుగూ నాకు సోపానమే
నీనుంచే అన్నీ నేర్చుకుంటున్నా
అనుభవాలను రంగరించుకుంటున్నా
ఆ అనుభవాలనే అడుగులుగా మలుచుకుంటున్నా
నీవు నేర్పిన బాటలోనే
వందలసార్లు ఓడిపోతూ
ఒక్క విజయానికి పయనమవుతున్నా
నీ స్పూర్తితోనే విజయానికి నిచ్చెనలు వేసుకుంటున్నా
అందుకే నీకు ధన్యవాదములు
జీవితమా!
నీవు ఇచ్చిన అనుభవాలు
నా మనసుకు ఆయుధాలు
అందుకే నీకు రుణపడిఉన్నా
ఓ జీవితమా నీకు సలామ్

No comments:

Post a Comment