Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 10 September 2015

గ్రహాల తప్పేముంది...

గ్రహాల తప్పేముంది...


బుధ శుక్ర కుజ శని గ్రహాలు
సక్రమంగానే తిరుగుతున్నాయి
భూమండలం
సూర్య గ్రహం
చల్లని చందమామ
అన్ని గ్రహాలూ
స్వగతిలోనే ఉన్నాయి
గ్రహాలు గతి తప్పినట్లు
శాస్త్రవేత్తలూ
చెప్పలేదు
దినకరుడి కిరణాలు
వెచ్చగానే తగులుతున్నాయి
నెలవంక వెన్నెల
హాయిగానే ఉంది
నింగిలోని తారకల్లో
మెరుపులు తగ్గలేదు
అంతా సవ్యమే
అపసవ్యమేమీ లేదు
మనసే గతిలో లేనప్పుడు
గ్రహ స్థితులను ఎలా నిందించను
రాలిపడే ధూళి కణం
ఆ మెరిసే చుక్క
దానిని ఏమని వరమడగను
ఆలోచనలే వాస్తులో లేనప్పుడు
వాస్తు దోషాలను ఎలా వెతకను
చీకటి సంద్రంలో మనసే మునిగిపోతే
కాంతి పుంజం ఎలా కోరుకోను
కాంతి లేదు
శాంతి లేదు
మనసే గతి తప్పినప్పుడు
గ్రహాలు మాత్రం ఏం చేస్తాయి
మనస్వినీ

No comments:

Post a Comment