Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 8 September 2015

దేవుడి డిఎన్ ఎ ఏమిటి ?

దేవుడి డిఎన్ ఎ ఏమిటి ?

మనిషివే నీవైతే
మనసనేది నీలో ఉంటే
మానవత్వమే నీకుంటే 
గుండె నిండా నింపుకుని చూడు
గుడిలోని శిలలో
కరుణామయుడు అల్లా కనిపిస్తాడు
జోడించిన హస్తాల్లో
నమాజులో చాచిన చేతులే కనిపిస్తాయి
మనసారా కళ్ళు తెరిచి చూడు
మసీదు నీడలో
సేదతీరుతున్న రాములవారే
కనిపిస్తారు
ఏది నీ మతం
ఏది నీజాతి
ఏ మతం గొప్పా
ఏ మతం మిథ్యా
విర్ర వీగకు నీవే గొప్పని
చులకన చేయకు అన్య మతాన్ని
ప్రవక్తల మాటలకు పెడార్ధాలు తీయకు
ఆచార్యుల ప్రవచనం అర్థాలే మార్చకు
ఉన్నాడో లేదో తెలియని దైవం కోసం
నీలో దేవుడిని చంపేయకు
దానవుడికి ఊపిరులూదకు
బోసి నవ్వుల చిన్నారి చిరునవ్వులో
ఏ మతం దాగుంది
నువ్వు చిందిస్తున్న రక్తంలో
ఏ దేవుడి మూలాలున్నాయి
చెప్పగలవా
దేవుడి డి ఎన్ ఏ ఏమిటో
నిరూపించగలవా దేవుడి మతమేంటో
మనిషిలో దేవుడిని చూడు
నీలో దేవుడిని ప్రేమించు
మానవత్వమనే మతానికి
పునాదులు వేయ్
అదే
అన్ని మతాలకన్నా
గొప్ప మతం

No comments:

Post a Comment