Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 6 September 2015

నిన్నెంత ప్రేమిస్తున్నా

నిన్నెంత ప్రేమిస్తున్నా

నీ మీద నాకు ప్రేమ ఎంత ఉందని
ఇలా అడిగితే ఏమని చెప్పను
నీకూ నాకూ మధ్య అనుబంధానికి
కొలమానం ఎలా చూపగలను
హృదయానికి
స్పందనలకు మధ్య అనుబంధాన్ని
ఒక్కసారి తరిచి చూడు
చిటారు కొమ్మన తన పిల్లలకు
గింజలు పెట్టే పక్షిలోని ఆత్రం చూడు
అప్పుడే కన్నులు తెరిచినా
తల్లిని చూసి విచ్చుకునే
పెదాల్లో మెరుపులు చూడు
మనసులో పుట్టి కనుచెలమలను దాటి
జారిపడుతున్న కన్నీటి చుక్కను అడుగు
నా ఊపిరిలో నీవై నిండి
జీవంపోస్తున్న శ్వాసను అడుగు
నా ప్రేమ తెలుస్తుంది
ఎంత ప్రేమిస్తున్నామనే దానికి
కొలమానాలే ఉంటే
నా గుండెను చీల్చి నీకు చూపించనా
మనస్వినీ

No comments:

Post a Comment