సమయమా నీకు సలాం
కాలమా రుణపడి ఉన్నా
నీకు
సమయమా సలాం చేస్తున్నా
నీకు
గడియారంలోని ముళ్ళకు
తలవంచుతున్నా నేను
తరలిపోతున్న ప్రతి
క్షణానికి
గులామునవుతున్నా నేను
వసంతంలా మనసును తాకి
ఎండమావిలా కరిగిపోయే
సమయమే లేకపోతే
నేనెక్కడా నా
అనుభూతులు ఎక్కడా
ఊహలకే పరిమితమైన
మనసుకు
అనుభవాలను నేర్పింది
కాలం
తడి చేరని కన్నులకు
వెచ్చని కన్నీటిని
పరిచయం చేసింది సమయం
మౌనమైన మనసుకు అక్షరాలు
నేర్పింది
జారిపోయిన ప్రతి క్షణం
గడిచిన ఘడియలే కాదు
దూసుకువచ్చే నిమిషమూ
ప్రియమే నాకు
గడిచిన మధురిమలు
కరగకుండా కరుడుగట్టిన
జ్ఞాపకాలు
కరిగిన కన్నీటిలో
కొట్టుకుపోయిన స్వప్నాలు
పెదాలపై తేనియల
పువ్వులు
హృదిలో చెలరేగే
సునామీలు
ఈ క్షణం నుంచి మరో
క్షణానికి
బదిలీ చేసుకుంటూ
కాలాన్ని నేస్తంగా
మలుచుకుంటూ
సమయాన్నే ఉనికిగా
మార్చుకుంటూ
గడియారం ముల్లు
అడుగుజాడల్లో
అడుగులువేస్తూ
నడుస్తున్నా
అనుభవ పుష్పాలను
జారవిడుస్తూ
నీరసాన్ని నిసృహను ప్రక్కన పెట్టి జోరుగా హుషారుగా సాగిపొండీ.
ReplyDeleteథాంక్స్ అడీ
Delete