హెచ్చరిక
కూలిన వైభవ శిఖర
శిథిలాలను తోసుకుంటూ
బయట పడుతున్నా మెల్లగా
కొత్త ఊపిర్లు
పోసుకుంటూ
కమ్ముకున్న
నల్లమబ్బులను చీల్చుతూ
ముందుకు సాగుతున్నా
కన్నులనే కాగడాలు చేసుకుంటూ
శిఖర విధ్వంసానికి
కారకులు ఎవరూ కారు
పునాదులలోనే ఎక్కడో
లోపముందేమో
నల్లమబ్బులకు చందమామను
నిందించను
నాకంటి చూపులోనే సమస్య
దాగి ఉందేమో
బతకాలని అనుకుంటున్నా
బతకనివ్వాలనీ కోరుకుంటున్నా
అయినా నన్ను కెలుకుతున్నారు
చివరిసారిగా
హెచ్చరిస్తున్నా
నడివీధిలో నగ్నంగా
నిలబడినోడికి
బట్టలూడదీసి కొట్టడం
సమస్యే కాదు
జీవించండి ప్రశాంతంగా
బతకనీయండి ఏదో ఒకలా
No comments:
Post a Comment