నేనే నేనే
మలిసంధ్యను వీడి
నవ ఉదయానికి స్వాగతం
పలుకుతున్నా
చీకటి ముసుగును
విసిరేసి
కాంతి కిరణానికి బాటలు
వేస్తున్నా
కాటు వేస్తున్న కలల
పరదాలు చింపివేసి
కొత్త స్వప్నికలను
గుండెకు హత్తుకుంటున్నా
గాయం చేసిన జ్ఞాపకాలను
తుడిచేసి
మనసుకు లేపనం
అద్దుకుంటున్నా
పుడమిని ముద్దాడిన
మనసును ఓదార్చి
ఆకాశవీధికి నిచ్చెనలు
వేస్తున్నా
గతకాలపు నిశి రక్కసిపై
కొత్త ఆశల ఆయుధాన్ని
సంధిస్తున్నా
ఇప్పుడు నింగీ నేలా
నేనే
కాలగమనానికి నాలుగు
దిక్కులూ నేనే
ఎందుకంటే
ఇప్పుడు నన్ను నేనే
ప్రేమిస్తున్నా
No comments:
Post a Comment