రాలిపడకతప్పదు మనసా
మెరిసే రంగులో
తెలియని మార్పు
ఏదో కానవస్తుంది
బిగిసిన
పరువాలలో మెల్లగా సడలింపు
మొదలవుతుంది
శాసించే తీయని
స్వరంలో
తెలియని
అపశ్రుతి మొదలవుతుంది
నీలిమేఘాల
శిరోజాలు
చీలికలు
పీలికలవుతాయి
గులాబీ
మధురిమల పెదాల రేకులు
రసరహితమై
వాడిపోతాయి
మీనములై గిలిగింతలు
రేపిన నయనాలు
నిర్జీవములై
కాంతిహీనమైపోతాయి
దర్పణం చూస్తే
జారిపోయిన దర్పం
వెక్కిరిస్తుంది
తారకవని
కొనియాడిన మనుషులు
దరిదాపుల్లో
కానరారు
అప్పుడు మనసు
తలపుల్లో
కదలాడుతుంది నువ్వు
వీడివెళ్ళిన మనసు
తిరిగి చూస్తే
ఆ మనసు
అనంతవాయువుల్లో
విలీనమై
మూగగానే పలకరిస్తుంది
మనసు మయూరమైనా
తుళ్ళిపడే
మంజీరమైనా
రాలిపడక
తప్పుదు మనసా
లెస్స వాక్యాలు రాసారు.
ReplyDelete