పరవశమంతా నువ్వే
తుంటరి చిరుగాలి
సవ్వడిని
గమనించలేదు నేను
మేఘములై
కమ్ముకున్న
నీ కురులలోనే
దాగియున్నా నేను
చలి వెన్నెల
జాబిలికి పొంగిపోలేదు నేను
నీ అరమోడ్పు
కనుల సోయగాలకే
బంధీని
అయ్యాను నేను
చలువ చందన పరిమళము
తాకలేదు నన్ను
సన్నజాజుల
గుభాళింపూ
మైమరిపించలేదు
నన్ను
నా ఊపిరిని
తడిమిన
నీ శ్వాస
మత్తులో మునిగిపోయాను నేను
గులాబీల
అందాలకు
మురిసిపోలేదు నేను
నీ పెదాల
కెంపులో
కరిగిపోయాను నేను
పరిసరాలను
చూడలేదు నేను
నీ పరువాలకు
బానిసనే నేను
పరవశమంతా నీలో
దాచుకుని
ప్రకృతి
కాంతపై నిందలెందుకు
ప్రకృతి కాంత పురుషుని ఒడిలో నిదురించింది
ReplyDeleteఅంతేనంటారా
ReplyDelete