సత్యమా నువ్వు అసత్యమా
వద్దువద్దంటూ
మెదడు పంపుతున్న సంకేతాలను
మనసెందుకో
బేఖాతరు చేస్తున్నది
పరుగులు
తీయమాకు పడిపోతావని
చేస్తున్న
హెచ్చరికలను పట్టించుకోబోనని మారాం చేస్తున్నది
పదిమందిలో
ఉన్నా
ఏకాంతమే
నాదయినా
నీ గురించే
పలవరిస్తున్నది
నీ చిన్న
పలకరింపునే మరలా మరలా కోరుతున్నది
ఎవరు నీవు ఎలా
ఉంటావు నీవు
మెదడుకూ
మనసుకు జగడం పెట్టావు
కరిగిన నా
అమావాస్యలో
చల్లని
వెన్నెల పలకరింపువా
కదలికలు
కోల్పోయిన మనసు కొలనులో
విరిసిన
పద్మానివా
మసకబారిన
మనోచంద్రికను అలరించే
కమ్మని
కలువబాలవా
మయూరనర్తనమై
మైమరిపించి
రమ్మని పిలిచి
కన్నుగీటే నెమలి కన్నువా
ప్రకృతి
కన్యకే వయ్యారాలు నేర్పే
సరససామ్రాజ్ఞి
అభిసారికవా
సత్యమా నువ్వు
అసత్యమా
కనులకే
తెలియని దృశ్యమా
మనసుతోటలో
ఉదయించిన ఇంద్రధనుస్సు వర్ణమా
మెదడును
జయించే అందమైన గెలుపువా
మనసును
మాయచేసే మధురమైన స్వప్నానివా
No comments:
Post a Comment