Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 5 October 2017

మనసా కవ్వించకే

మనసా కవ్వించకే


నిదురించిన మనసును
మెత్తగా తడుముతావు
చిరుసందేశమై
మెల్లగా తట్టి లేపుతావు
మరణించిన భావాలకు
కొత్త ఊపిరులు పోస్తావు
వాడిన కుసుమాలకు
పరిమళాలు పూస్తావు
ఎండమావిలోనూ
నవవసంతమై పలకరిస్తావు
నవస్వప్నానికి తెరలేచే లోగా
మంచుముత్యమై కరిగిపోతావు
మనసును నిదురించనీయక
కవ్వింపులతో దోబూచులాడతావు
కవ్వించకే మనసా
నిదురపోనీ నా మనసుని 

6 comments:

  1. I really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational and Govt Jobs information.
    Click Here To educational and Govt Jobs information.

    ReplyDelete
  2. మీ మనసు బహు సున్నితం సుమా

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మాజీ

      Delete
  3. కవిత చాలా బాగుంది. నా మనస్సు దోచిందంటే నమ్మండి.
    మరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి

    ReplyDelete