రగులుతూనే ఉండనీ
తడియారని
కన్నులలో
కళ్ళు పెట్టి
చూడకు
కరుగుతున్న
కలలవరదలో
నువ్వూ
కొట్టుకుపోతావు
చితిమంటల
చిటపటరాగం
వినిపించే మనసుపై
పన్నీరు చల్లకు
పొగలు కక్కే
నివురులో
మేఘమై
కరిగిపోతావు
బీటలు వారిన
పుడమిలాంటి
హృదయసీమలో
వలపు మొక్కలు నాటకు
పచ్చదనాల నీ
వసంతం వాడిపోతుంది
విరిసే నా
పెదాలపై
ప్రణయకెంపులు
వెతకకు
తెలియని చీకటి
కథలకు
అవి ముఖద్వారాలని
తెలుసుకుంటావు
కానరాని
అగ్నిపర్వతమే నేను
నన్ను నాలోనే
రగిలిపోనీ
No comments:
Post a Comment