మరణానికి సవాల్
హద్దులు సరిహద్దుల
గీతలు చెరిపేస్తున్నా
సహనం అసహనం మధ్య
వారధిని
కూల్చేస్తున్నా
పనికిరాని విలువలను
వలువలుగా
విసిరేస్తున్నా
కూడుపెట్టని సభ్యతా
సంస్కారాలను
పాతాళానికి తొక్కేస్తున్నా
మెత్తని మాంసంముక్క
గుండెకాయకు
రాతి కవచం
తొడుగుతున్నా
ఎవడో పలికిన పలుకులకు
కాదు
మనసు మాటకే కట్టుబడి
ఉన్నా
ఇంకా ఏం జరుగుతుంది
ప్రతి ఘడియనూ మౌనంగానే
స్వీకరిస్తున్నా
కఫన్ తలకు
చుట్టినవాడిని
మరణానికే సవాల్
విసురుతున్నా
మనసు మాటకు మీరు కట్టుబడ్డం కామన్
ReplyDeleteమనసు మీకు కట్టుబడితే సూపర్ కదండీ :)
యస్ పద్మార్పితజీ
Deleteసవాల్ మరణానికి ధైర్యవంతులు.
ReplyDeleteధన్యవాదములు
Delete