వేకువలో వెన్నెలనే
భావలోకపు విహారిని
నేను
కాల్పనిక జగత్తులో
అడుగుజాడలను వెతుక్కునే
శోధకుడిని నేను
నీలకాశానికి నిచ్చెన
వేసి
మిలమిలా మెరిసే
నక్షత్రం నేను
అక్షరాలను రెక్కలుగా
చేసుకుని
అనంతవిశ్వంలో పయనించే
విహంగం నేను
ఎండమావిలో గొంతు
తడుపుకున్న
దాహార్తిని నేను
మకరందంకోసం మైమరిచి
గులాబీ ముల్లుకు
గాయపడిన భ్రమరం నేను
వేకువలో కురిసి
కరిగిపోయిన
వెన్నెలనే నేను
నిజమేదో అబద్ధమేదో
తెలియక మిగిలిన
అర్థంకాని ప్రశ్నను
నేను
నాలో నన్ను వెతుకుతూ
నాలో నన్ను కోల్పోయిన
పరాజితుడిని నేను
నానుంచి నేను
విడివడుతూ
నేనుగానే మిగిలిపోయాను
నేను
మీకు మీరే మిగిలినా..మీలో అదే ప్రత్యేకత :)
ReplyDelete