ఊహ
అందమైన ఊహవు నీవు
మనసైన పలకరింపు నీవు
మదిలో చిరుతలపుకే
పులకరింతలు రేపుతావు
నీవు
చిన్ని చిన్ని
ఊసులతోనే
కలవరింతలు కలిగిస్తావు
నీవు
అవునంటే కాదంటూ
కాదంటే అవునంటూ
గుండెల్లో గుబులు కలిగిస్తావు
నీవు
మనసూ మనసుల మంతనాలలో
వెచ్చని సెగలతో ఉడికిస్తావు
నీవు
కానరాని రూపంతో
కనులముందే కదలాడుతావు
నీవు
అందమైన ఊహవే కదా
ఊహిస్తూనే ఉంటాను నేను
No comments:
Post a Comment