Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 6 September 2017

మరణానికి సవాల్

మరణానికి సవాల్
 
హద్దులు సరిహద్దుల
గీతలు చెరిపేస్తున్నా
సహనం అసహనం మధ్య
వారధిని కూల్చేస్తున్నా
పనికిరాని విలువలను
వలువలుగా విసిరేస్తున్నా
కూడుపెట్టని సభ్యతా సంస్కారాలను
పాతాళానికి తొక్కేస్తున్నా
మెత్తని మాంసంముక్క గుండెకాయకు
రాతి కవచం తొడుగుతున్నా
ఎవడో పలికిన పలుకులకు కాదు
మనసు మాటకే కట్టుబడి ఉన్నా
ఇంకా ఏం జరుగుతుంది
ప్రతి ఘడియనూ మౌనంగానే
స్వీకరిస్తున్నా
కఫన్ తలకు చుట్టినవాడిని
మరణానికే సవాల్ విసురుతున్నా

4 comments:

  1. మనసు మాటకు మీరు కట్టుబడ్డం కామన్
    మనసు మీకు కట్టుబడితే సూపర్ కదండీ :)

    ReplyDelete
  2. సవాల్ మరణానికి ధైర్యవంతులు.

    ReplyDelete