Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 3 July 2020

మృత కళేబరాళ్ళం మనం..


మృత కళేబరాళ్ళం మనం..
మనం మనుషులం
బతికున్నా కదలికలు లేని శవాలం
మనకోసం గొంతెత్తి
మనకోసం పోరాడి నెత్తుటి ముద్దలుగా మారిన పిచ్చివాళ్ల శవాలను చూసీ చూడనట్లు వదిలేస్తాం
మన కోసం కలాన్ని కరవాలంగా మార్చి
లాఠీ దెబ్బలు తింటూ
చిత్రహింసలకు గురవుతూ
జైలులో చావుబతుకులతో
పోరాటం చేస్తున్న మతిలేని వాళ్ళ గురించి పట్టించుకోలేం
వీధిపోరాటాలు కాదు కనీసం గొంతెత్తి మాట్లాడటం
మనకెందుకు
మనం మన పిల్లాజెల్లా
బతికుంటే చాలు
ఇలా బతికేద్దాం
పనికి మాలిన వ్యర్ధాల్లా
బతికున్న శవాల్లా
రాజ్యానికి తొత్తుల్లా
మనం మనుషులం కదా
ఆ పిచ్చోళ్ళు ఎలా ఛస్తే మనకేంటి...

No comments:

Post a Comment