Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 25 July 2020

నా విజయసారథులు(PART-18)


నా విజయసారథులు(PART-18)
క్రైమ్ బ్యూరో చీఫ్ గా నేను మాత్రమే అద్భుత విజయాలు సాధించానని చెప్పటం లేదు. కానీ నాకంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నాను. ఒక సొంత ఇమేజిని క్రియేట్ చేసుకోగలిగాను. ముఖ్యంగా హైదరాబాద్ క్రైమ్ కవరేజిలో దూకుడు తత్వంతో ప్రత్యర్థి చానల్స్ కు కునుకులేకుండా చేసింది మాత్రం నిజం. జెమినీలో ఉన్నా జీ 24గంటలు ఛానల్ లో ఉన్నా క్రైమ్ విషయంలో ఎప్పుడూ వెనకబడలేదు. అనేక సందర్భాలలో సంచలనాలే నమోదు చేసాం.. అయితే ఇదంతా నా ఘనత కాదు. ఇది నా టీమ్ గొప్పతనం. ఇరవై నాలుగు గంటలూ నాతో టచ్ లో ఉంటూ ఏదో ఒక బ్రేకింగ్ తో సంచలనం రేపే నా స్ట్రింగర్స్ ని ఎలా మరిచిపోగలను. గౌస్ క్రైమ్ లో మనం చాలా ముందున్నాం అని మేనేజ్ మెంట్ పొగిడితే అది మొత్తం నా టీమ్ గొప్పతనమే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా నా విజయాలకు చేయూతనిచ్చారు. జెమినిలో ఉన్నప్పుడు
Anil Kumar, sathish yadav, Bacchu Anjayya, Teja Bhooma
వంటి మిత్రులు నా టీమ్ లో లోకల్ స్ట్రింగర్స్ గా ఉండేవారు. అర్ధ రాత్రి ఎన్ కౌంటర్ సమాచారం వస్తే నేను చెప్పగానే ఒక డొక్కు స్కూటర్ మీద కూకట్ పల్లి నుంచి నర్సాపూర్ అడవులదాకా వెళ్లివచ్చిన అనిల్ కుమార్ అంకితభావాన్ని ఎలా మరువగలను. తర్వాత అనిల్ సందేశ్ టివి పేరుతో ఒక సొంత ఛానల్ నడిపారు. ఇక జీ 24 గంటలు ఛానల్ లో అయితే నా టీమ్ ఒక పటిష్ఠమైన సైన్యంలా పని చేసింది. వీరిలో ముఖ్యంగా sirigiri
Srinivas Srigiri, Sateesh Yadav, Bacchu Anjayya,
Syed Ibrahim Ali, akhtar, Lekkala Santosh, Nagaraju,
Lakshmi Narayana TelanganaKrupakar Raju, kirti shrinivas , sandip reddy, Nimma Sandeep Reddy, prasad, bhushan ఉస్మానియా శ్రీధర్ ఇలా ఓ ఇరవై మందితో ఒక స్ట్రాంగ్ టీమ్ ఉండేది. నేను క్రైమ్ బ్యూరో చీఫ్ గా సుధాకర్ గౌడ్, ఇన్నారెడ్డి నాకు స్టాఫ్ రిపోర్టర్స్ గా ఒక మంచి సైన్యమే ఉండేది. బాగా విస్తరిస్తున్న నగరంలో క్రైమ్ రేటు కూడా బాగా పెరుగుతున్న సమయంలో నా టీమ్ సభ్యులు ఎండనకా వాననకా తమ బైక్ల మీద తిరుగుతూ న్యూస్ కవర్ చేసేవాళ్ళు. మామూలుగా అన్ని చానల్స్ కు ఈ వ్యవస్థ ఉండేది కానీ వారికీ మా టీమ్ కి చాలా తేడా ఉండేది. వారికి అక్కడ జీతాలే ఉండేవి కాదు. మా దగ్గర అలా కాదు ప్లే అయిన ప్రతి స్టోరీకి డబ్బులు లెక్క కట్టి ఇవ్వాల్సిందే. ఒక్కొక్కరికి కనీసం పదివేలకు తగ్గకుండా చూసుకునే వాడిని. ఈ విషయమై ప్రతి నెలా మా హెచ్ ఆర్ తో నాకు గొడవ జరిగేది. స్టాఫ్ రిపోర్టర్స్ కంటే స్ట్రింగర్స్ కే జీతాల రూపంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని హెచ్ ఆర్ బాధ. నేనేమో స్ట్రింగర్స్ పక్షపాతిని. ఎందుకంటే వారి బాధలు నాకు తెలుసు, నేనూ అదే స్థాయి నుంచి వచ్చిన వాడిని గనుక.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఎలాంటి క్రైమ్ న్యూస్ కైనా గంటలు గంటలు లైవ్ లో ఉంటూ టివిలో కనిపించేవాళ్ళం. కానీ స్ట్రింగర్స్ కి ఆ అవకాశం ఉండేది కాదు. వాళ్ళు ఎంత పెద్ద క్రైమ్ స్టోరీ తెచ్చినా లైవ్ లో మాత్రం మేమే ఉండేవాళ్ళం.. అంటే వాళ్ళు బండ చాకిరీ చేసినా గుర్తింపు మాత్రం దక్కేది కాదు. ఇదినాకు బాధగా ఉండేది. తీవ్రంగా ఆలోచించి మా బాస్ ముందు ఒక విప్లవాత్మక ప్రతిపాదన పెట్టాను. తెలుగు న్యూస్ మీడియాలోనే సంచలనం రేపిన ప్రతిపాదన ఇది. ఇకనుంచి సిటీ స్ట్రింగర్స్ ఏ న్యూస్ స్టోరీ తెచ్చినా ఆ స్టోరీ ముగింపులో వాళ్ళ పీ టూ సి ప్లే చేయాలనేది నా ప్రతిపాదన. మా ఆఫీసులో అందరూ వ్యతిరేకించారు. వాళ్ళు మన ఎంప్లాయిస్ కాదు వాళ్ళను ఎలా టివిలో చూపిస్తామని వారి వాదన. అయితే మా బాస్ శైలేష్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఒకే చేశారు. అంటే స్ట్రింగర్స్ చేసే స్టోరీలలో చివరి ముప్ఫయ్ సెకండ్లు వారే కనిపించి స్టోరీకి ముగింపు వాక్యాలు చెబుతారన్న మాట. అప్పటికీ తెలుగు న్యూస్ చానల్స్ లో ఈ పద్దతి లేదు. మొట్టమొదట ఇది మేమే చేసాం. ఇప్పటికీ ఈ పద్దతి వేరే చానల్స్ లో ఉన్నట్టు లేదు. ఇంతేకాకుండా అందరు స్ట్రింగర్స్ తో ఒక ప్రోమో కూడా షూట్ చేసి రోజుకు పదిసార్లు ప్లే చేసేవాళ్ళం. వేరే చానల్స్ స్ట్రింగర్స్ మా స్ట్రింగర్స్ గురించి గొప్పగా చెప్పుకునేవారు. నా టీమ్ కూడా నామీద అంతే అభిమానంగా ఉండేది. పటోళ్ల మర్డర్ విజువల్స్ అందరికంటే ముందు తెచ్చిన సంతోష్, క్విక్ యాక్షన్ సోల్జర్జ్ గా రెడీగా ఉండే సతీష్ యాదవ్, ఎలాంటి విజువల్స్ అయినా ఎక్కడినుంచైనా తెప్పించే సిరిగిరి శ్రీనివాస్, ఓల్డ్ సిటీలో చీమ చిటుక్కుమన్నా స్పందించే ఇబ్రహీం, ఎయిర్ పోర్ట్ పై స్పెషల్ స్టోరీస్ తో ఆకట్టుకున్న బచ్చు అంజయ్య ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతతో పని చేయడం వల్లే నా సక్సెస్ సాధ్యమయ్యింది. నా కెరీర్ లో మైలు రాళ్లుగా నిలిచిన నా టీమ్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.మీడియా యాజమాన్యాలు ఒక విషయం గుర్తుంచుకోవాలి స్ట్రింగర్స్ లేకపోతే ఛానల్ లేదు. వారిని కడుపులో దాచుకోండి..

No comments:

Post a Comment