Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday 7 July 2020

నవ్వుతూనే ఉన్నా...


నవ్వుతూనే ఉన్నా...
మనసునిండా గాయాలతో
రక్తమోడుతున్నా
కన్నీళ్ల లేపనంతో
చిరునవ్వులు పులుముకుంటూనే ఉన్నా...
నలువైపులా సమరంలో
ఓడిపోతూనే ఉన్నా
అయినా మైదానంలో నిలిచి పోరాటం నటిస్తూనే ఉన్నా...
జీవితమనే చదరంగంలో ఏనాడో మరణించా
కాలు కదపలేని రాజులా
జీవచ్ఛవమై నిలిచే ఉన్నా ...
మనిషినో శవాన్నో
ఆత్మనో ప్రేతాత్మనో
మోడువారిన నగరిలో
వాడిన వసంతమై
నవ్వుతూనే ఉన్నా...

No comments:

Post a Comment