మట్టిలోనే కలిసిపోతా
నేను నేనేగా
మరొకరిని ఎలా అవుతాను
నాలో లేనిది నాలో ఎలా
కనపడుతుంది
నాలో ఉన్నదే నాతో ఉంటుంది
సిరి సంపదలు నాకు లేవు
ఉన్నతమైన భావాలూ నాకు లేవు
ఇంద్రులు చంద్రులు ఎందరైనా
ఉండవచ్చు
మట్టి మనిషిని నేను
మట్టి వాసనే వస్తుంది
గుభాళింపులు నాకెక్కడివి
మట్టి ఆలోచనలు తప్ప
సుగంధాలు ఎక్కడివి
భోగ భాగ్యాలు నాకు లేవు
వాటికోసం ఆరాటమూ లేదు
మనసులోనే సిరిని చూసుకున్నా
మనసులోనే బతుకును వెతుక్కున్నా
అక్షరాలను అల్లుకున్నా
భావాలను రాసుకున్నా
నా మనసుకే అన్నీ
అంకితమిచ్చుకున్నా
పరాయి మనసులను తాకలేదు
ఏ మనసునూ కదిలించలేదు
నా గోడు నా మనసుకే చెప్పుకున్నా
నా మనసుకే పట్టని నా వేదన
ఎవరికీ అర్ధం కాని ఆవేదన
గజిబిజి మనసుల తులాభారంలో
జారిపడిన మట్టి మనిషిని
మట్టిలోనే కలిసిపోనా
No comments:
Post a Comment