మరో ప్రస్థానం
విడివడిన అడుగులు
నడువలేకున్నవి
ఒంటరి అడుగుల పయనం
వల్ల కాదని అంటున్నవి
జతగూడి నడిచిన అడుగుల
జాడలను
మరలా వెతుకుతున్నవి
తీరాల ముంగిట నిలిచిన
అడుగులు
జాడలనే పిలుస్తున్నవి
ఒంటరి నడకలో
పువ్వులైనా
ముళ్ళనే మారాం
చేస్తున్నాయి
ముళ్ళ కంచెలో నడకైనా
జతకలిస్తే పూలబాటే
అంటున్నవి
మనసెరిగిన అడుగులు
జాడలను చేరుకుంటాయా
చేరువైన అడుగులు
కొత్త జాడలను
సృష్టిస్తాయా
నవ్య బాటలో పయనం
తీరాలను దాటుతుందా
అనుభవాల సుడిలో పాఠం
నేర్చిన
అడుగులు మరలా
వసంతాన్ని ముద్దాడుతాయా
వాడిన వసంతంలో
మారాకులు పలకరిస్తాయా
జతగూడిన అడుగులు
మరో ప్రస్థానానికి తెర
లేపుతాయా
No comments:
Post a Comment