మనసంతానువ్వే
ఎప్పుడు చూసావని నా
మనసుని
ఎప్పుడు తొంగి చూసావని
నా ఎద లోతుల్ని
ఎప్పుడు
తెలుసుకున్నావని నా అంతరంగాన్ని
ఎప్పుడు గ్రహించావని
నా మాటల మతలబులని
ఎప్పుడు విన్నావని నా
మనసు భాషని
ఎప్పుడు కదిలించావని
నాలోని భావాలని
నీ భావం నీదే
నీ భాష్యం నీదే
నీ ఆలోచన నీదే
నీ అంతరంగం నీదే
నీ మథనం నీదే
నీ వేదన నీదే
ఒక్కసారి తొంగి చూడు
మనసులోకి
ఒక్కసారి కనులు విప్పి
చూడు నా అంతరంగాన్ని
ఒక్కసారి విప్పి చూడు
నా మనోపుస్తకాన్ని
ప్రతి పేజీలో నువ్వే
ప్రతి అక్షరంలో నువ్వే
ప్రతిభావంలో నువ్వే
నా వేదనలో నువ్వే
నా రోదనలో నువ్వే
నా హాస్యం నువ్వే
నా లాస్యం నువ్వే
నా సర్వమూ నీవే
మెదడుతో కాదు
మనో నేత్రంతో చూడు
నా మనసంతా నువ్వే
No comments:
Post a Comment